తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ (FRC) చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న కొత్త ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను SIRలో ఓటర్ల ధ్రువీకరణ, పరిశీలన కోసం ఆమోదించలేమని వెల్లడించింది.ముందస్తు క్షేత్రస్థాయి విచారణ, పత్రాల పరిశీలన లేకుండానే రేషన్ కార్డు డేటా ఆధారంగా
ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌ను రెండు రోజుల్లో అందిస్తున్నారని అందువల్ల కుటుంబ ధ్రువీకరణ పత్రంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.