గుడివాడ వన్ టౌన్ ఎస్సై సత్యనారాయణ కొడాలి నాని ఇంటికి వెళ్లి ఆయన్ను హౌస్ అరెస్టు చేస్తున్నట్లు ఉత్తర్వులు అందించారు. దీంతో కొడాలి నాని డీఎస్సీ నిరసనలకు వెళ్లరని అంతా భావించారు. కొడాలి నాని ర్యాలీ నిర్వహించి మరీ డీఎస్సీ ఆందోళనల్లో పాల్గొన్నారు. దీనికి కారణం స్థానిక ఎస్సై సత్యనారాయణ సహకారమే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఇవాళ ఆయన్ను వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.