ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండలం పుట్లగట్లగూడెం ప్రాంతంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రీన్ఫీల్డ్ జాతీయరహదారిపై లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అతి కష్టం మీద క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీశారు. ఇంటర్ సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.