దక్షిణామెరికా దేశం కొలంబియాలో సంభవించిన భయంకరమైన భూకంపం భారీ వినాశనాన్ని మిగిల్చింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 213 మంది ప్రాణాలు కోల్పోగా, 900 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు న్యూస్18 కథనం పేర్కొంది. శిథిలాల కింద చిక్కుకుని 3,000 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రసిద్ధ నగరాలైన కాలి, పెరీరా, మణిజాలెస్, క్విబ్దోలలో 165కి పైగా బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయని మేయర్ల సంఘం వెల్లడించింది.