ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం గాల్లో ఉండగా ఇంజన్‌లో లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్, ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని విజయవాడలో దించకుండా హైదరాబాద్ వైపు మళ్లించారు. మార్గమధ్యంలోనే ఇంజన్ సమస్య పరిష్కారం కావడంతో పైలట్ విమానాన్ని తిరిగి విజయవాడ వైపు తీసుకెళ్లారు. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ప్రయాణిస్తున్నారు.