మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన సీక్రెట్స్, టైటిల్స్‌ను సరదాగా ముందే లీక్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో పలు చిత్రాల విషయంలో జరిగినట్లే, తాజాగా తన 158వ సినిమా టైటిల్‌ను కూడా చిరంజీవి బహిరంగంగా లీక్ చేశారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 158’ (Mega 158) గురించి సంగీత దర్శకుడు తమన్‌తో సంభాషిస్తున్న సమయంలో ఈ సినిమా పేరు ‘కదిరి’ అని చిరంజీవి చెప్పేశారు.