పల్నాడు జిల్లా వైసీపీ సెక్రటరీ చెన్నారెడ్డి హత్య కేసులో నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగుతుంది. ఆగస్టు నెల ఆరో తేదీన రాత్రి సమయంలో తన స్వగ్రామమైన రెంటాలకు బైక్‌పై వెళుతున్న చెన్నారెడ్డిపై దారి కాచిన ప్రత్యర్థులు కారుతో ఢీ కొట్టి, కళ్లలో కారం చల్లి పీక కోసం హత్య చేశారు. హత్య చేసిన వెంటనే గోవాకు పారిపోయినట్లు భావిస్తున్నారు. అశోక్ రెడ్డితో పాటు రాజశేఖర్ రెడ్డి, కోటిరెడ్డి, పేరెడ్డి నలుగురు గోవాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వీరిని పట్టుకునేందుకు విమానంలో గోవా వెళ్లారు.