జార్ఖండ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత, ఉద్యోగార్థులపై పోలీసుల లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగాన్ని నిరసిస్తూ మంగళవారం (ఆగస్టు 11) భారతీయ జనతా పార్ట పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్‌తో పలు జిల్లాల్లో సాధారణ జీవనం తీవ్రంగా ప్రభావితమైంది. రాజధాని రాంచీతో పాటు ప్రధాన నగరాల్లో పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూతపడగా, వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం 8:00 గంటల నుండి అర్ధరాత్రి 12:00 గంటల వరకు ఈ బంద్ కొనసాగుతుందని, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య సాహు తెలిపారు.