మెటా 8,000 మంది ఉద్యోగులను తొలగించిన కొన్ని వారాల తర్వాత, ఏఐ పుష్కలంగా ఉద్యోగాలను సృష్టిస్తుందని మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ అన్నారు. ఏఐ భారీ నిరుద్యోగానికి కారణం కాకుండా, పుష్కలంగా ఉద్యోగాలను సృష్టిస్తుందని జుకర్బర్గ్ విశ్వాసం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో ఏఐతో చిన్న బృందాలే పెద్ద వ్యాపారాలను నడుపుతాయన్నారు. విస్తృత పునర్నిర్మాణంలో భాగంగా మెటా ఇటీవల ఉద్యోగులను తొలగించిన కొన్ని వారాలకే ఈ వ్యాఖ్యలను బ్లాగ్ పోస్ట్ చేయడం గమనార్హం.