హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు 10 చోట్ల 40శాతానికిపైగా ఓట్లను కోల్పోతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఎనిమిదిలో మూడింట 40 శాతానికిపైగా ఓట్లు రద్దయ్యాయి. సంఖ్యాపరంగా శేరిలింగంపల్లిలో 3.29 లక్షల ఓట్లు, ఎల్బీనగర్లో 2.7 లక్షలు, మహేశ్వరంలో 2.35 లక్షల ఓట్లు రద్దవడం గమనార్హం. సొంతూళ్లలో ఓటును కొనసాగించుకుని, హైదరాబాద్లో రద్దు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో రాజధాని ఓట్ల సంఖ్య దాదాపు సగం తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో 5 స్థానాలుండగా గరిష్ఠంగా ఉప్పల్ నియోజకవర్గంలో 39.95 శాతం ఓట్లు రద్దయ్యాయి.