ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అవకతవలకు నిరసనగా జార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారంనాడు విద్యార్థులు పెద్దఎత్తున చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థులు బారికేడ్లు దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. స్టూడెంట్లపై లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్, వాటెర్ కెనాన్లు ప్రయోగించారు. అసెంబ్లీకి సమీపంలోని చివరి బారికేడ్‌కు విద్యార్థులు చేరుకోగానే పోలీసులు విరుచుకుపడ్డారు. పలువురు విద్యార్థినులు కూడా గాయపడ్డారని,
పోలీసులు తమ తలలు, కాళ్లు, చేతులు, ఎక్కడపడితే అక్కడ కొట్టారని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు