జార్ఖండ్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం తప్పని రాహుల్ గాంధీ తేల్చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని, చర్చల ద్వారా మాత్రమే పరిష్కారాలు లభిస్తాయని ఆయన తెలిపారు. జార్ఖండ్ ప్రభుత్వం ఆ విద్యార్థుల మాటలను వినడం కొనసాగించాలి, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాహుల్ సూచించారు. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ నడుపుతున్న సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.