ఏలూరు జిల్లా కలిదిండిలో జరిగిన మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. సుపరిపాలనకే తమ మొదటి ప్రాధాన్యమని, తాను, పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యేవరకు అధికారులు గట్టిగా పని చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఏకైక అజెండా అని, సమస్యలు పరిష్కరిస్తేనే ప్రజలు జై కొడతారని చంద్రబాబు తెలిపారు.