హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ జల సంధిలో చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. దాంతో నౌకలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడుల్లో పక్కనే ఉన్న మరో చమురు నౌక కూడా స్వల్పంగా దెబ్బతిన్నది. అయితే దాడికి గురైనవి ఏ దేశానికి చెందిన ట్యాంకర్లు, సిబ్బంది ప్రాణాలతో ఉన్నారా లేదా..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు దక్షిణ ఇరాన్ గగనతలంలో చక్కర్లు కొడుతున్న అగ్రరాజ్య ఎంక్యూ-9 డ్రోన్‌ను ఐఆర్‌జీసీ దళాలు కూల్చివేశాయని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.