తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వ దవాఖానల్లో పీపీపీ మోడల్‌లో ప్రైవేట్ MRI సేవలు అందుబాటులోకి రానున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానాన్ని తీసుకువస్తోంది. దీని ద్వారా నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. తొలి దశలో నిజామాబాద్, ఖమ్మం అలాగే మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో ఈ నూతన విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా మొదలుపెట్టనున్నారు. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.