బంగారాన్ని మలద్వారంలో చొప్పించుకొని దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగింది. సర్ఫరాజ్ మాలా అనే యువకుడు 467.09 గ్రాముల బంగారాన్ని ముద్దగా మార్చి తన మలద్వారంలో చొప్పించుకున్నాడు. జెడ్డా నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కస్టమ్స్ అధికారుల చెకింగ్‌లో అతడి మలద్వారం వద్ద బంగారం ఉన్నట్టు గుర్తించారు. వెంటనే దానిని బయటకు తీసి కడ్డీగా మార్చగా 422.83 గ్రాములు ఉన్నట్టు అధికారులు తెలిపారు. బంగారు విలువ దాదాపుగా రూ.65.7 లక్షలు ఉంటుందని తెలియజేశారు.