హాలీవుడ్ ప్రముఖ నటుడు, అమెరికా మాజీ ప్రజాప్రతినిధి బెన్ జోన్స్ (84) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం పట్ల హాలీవుడ్ సినీ వర్గాలు మరియు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 1979 నుండి 1985 మధ్య అత్యంత ప్రజాదరణ పొందిన ‘ది డ్యూక్స్ ఆఫ్ హజార్డ్’ టెలివిజన్ సిరీస్‌లో ‘కూటర్ డేవన్‌పోర్ట్’ అనే మెకానిక్ పాత్రను పోషించి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు పొందారు. పలు హాలీవుడ్ చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు.