మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుండి 159 మంది ప్రయాణికులతో బయలుదేరిన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం (MH184) కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా విమాన కాక్పిట్పై శక్తివంతమైన లేజర్ కిరణాలు పడ్డాయి. ఈ అకస్మాత్తు వెలుగుల వల్ల పైలట్ దృష్టి చెదిరే ప్రమాదం ఏర్పడింది.పైలట్ వెంటనే అప్రమత్తమై ల్యాండింగ్‌ను
నిలిపివేయడంతో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. లేజర్ వెలుగులను ఎవరు ప్రసరింపజేశారనే దానిపై ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో పాటు స్థానిక విస్తృతంగా దర్యాప్తు చేపడుతున్నారు.

