ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ రాహుల్ నవీన్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీతో ఆయన పదవీ కాలం ముగియబోతుండగా.. అనూహ్యంగా మరో ఏడాది కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, రాహుల్ నవీన్ 2027, ఆగస్ట్ 13వ తేదీ వరకు డైరెక్టర్ బాధ్యతల్లో కొనసాగనున్నారు… తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈయన డైరెక్టర్ బాధ్యతల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది.

