మాజీ మంత్రి బాలినేనిపై కరపత్రాలు ముద్రిస్తే పుస్తకాలు సరిపోవని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. కూటమిలో విభేదాలు సృష్టించేలా ఆయన మాట్లాడుతున్నారని ఆయన కూటమిలో ఉన్నారని మౌనంగా ఉన్నాం.బార్ షాపులు సిండికేట్ చేసి తండ్రీకుమారులు రూ.కోట్లు వసూలు చేశారు. గత ప్రభుత్వంలో మాపై 79 కేసులు పెట్టించారు. బాలినేని పార్టీ మారారు కాబట్టి సరిపోయింది.. లేకుంటే తండ్రీకుమారులను లోపల వేసేవాళ్లం. గత ప్రభుత్వంలో చేసినట్లు రౌడీయిజం చేస్తామంటే కుదరదు. జనసేనను అడ్డుపెట్టుకుని వైకాపా నేతలకు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

