శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ (ఆదివారం) భారీ వర్షాలతో కూడిన పిడుగులు బీభత్సం సృష్టించాయి. మందస ఏజెన్సీ ప్రాంతంలోని పాతకోటలో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా వ్యవసాయ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

