పోలవరం జిల్లా చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సదుపాయం లేక, మెరుగైన వైద్యశాలకు వెళ్లేందుకు అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బాలిక మృతి చెందింది. పెదసీతనపల్లి గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి సొడి లశ్య.. సెలెబ్రల్ మలేరియాతో చనిపోయింది. 100 పడకల అసూపత్రిగా అప్ గ్రేడ్ అయినా సరైన వసతులు, వైద్య సదుపాయం
అందుబాటులో లేక ఇప్పటికీ మెరుగైన వైద్యం లభించడం లేదు. ప్రభుత్వ అంబులెన్స్ లు అందుబాటులో లేకపోవడంతో
చింతూరు ఐటిడిఎ ఎదుట ఆందోళన చేపట్టారు బాలిక తల్లిదండ్రులు, కుటుంబీకులు.