పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్న శిరోమణి అకాలీదళ్ (సాద్) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ శనివారం సంచలన ప్రకటన చేశారు. కేంద్రం తీసుకురానున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతిస్తుందని ప్రకటించారు. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే విధంగా న్యాయబద్ధంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని తమ పార్టీ కోరుకుంటున్నట్టు చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రతిపాదనను తాము సమర్ధిస్తున్నట్టు తెలిపారు.