ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం, అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి అయిన జార్జ్ మెస్సీ అనారోగ్యంతో పోరాడుతూ 68 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అర్జెంటీనాలోని రోసారియోలో ఉన్న ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జార్జ్ మెస్సీ మరణించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జార్జ్ మెస్సీ,మెస్సీకి అన్ని విధాలుగా మార్గనిర్దేశం చేశారు.లియోనెల్ మెస్సీ చిన్న తనం నుంచి ఆయన తండ్రి ఫుట్ బాల్ వైపు రాణించేలా ప్రొత్సాహం అందించారు.