హెచ్-1బీ, ఎల్-1 వంటి వీసాలు ఉన్న ఉద్యోగులు ఊహించని విధంగా లేఆఫ్స్ గురైనా లేదా ఉద్యోగానికి రాజీనామా చేసినా, 60 రోజుల వ్యవధిలో వారు మరో కంపెనీలో కొత్త ఉద్యోగాన్ని సాధించి తమ వీసాను బదిలీ చేసుకోవడానికి, లేదా వేరే వీసా కేటగిరీకి మారడానికి అవకాశం ఉండేది. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఉద్యోగం పోతే సమయం ఇవ్వకుండా.. తక్షణమే అమెరికా భూభాగాన్ని వదిలి వెళ్లాలనే కఠినమైన ప్రతిపాదనను అక్కడి ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నిర్ణయంతో ఐటీ ఉద్యోగుల భవిష్యత్తు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది.