కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎరువుల పంపిణీ కోసం ఓ కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం తీసుకువచ్చిన ఎఫ్ఎఫ్ఎస్(ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలిజర్స్) యాప్ ద్వారా యూరియా, డిఏపితో పాటు అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులను బుక్ చేసుకోవచ్చు. బ్లాక్ మార్కెట్ ను తగ్గించడానికి కేంద్రం ఈ యాప్ ను ప్రవేశపెట్టింది. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, ఆరుతడి ఉద్యాన పంటలు ఇలా ఏ పంట సాగుచేసిన ఈ యాప్ లో బుక్ చేసుకోవడం ద్వారా సాగు చేసిన పంటలకి ఎరువులు పొందే అవకాశం ఉంటుంది.