తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండపై నుంచి కిందకు వస్తున్న ఓ కారు అదుపుతప్పి, 22వ మలుపు వద్ద ఉన్న పిట్టగోడను బలంగా ఢీకొట్టి సుమారు 15 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భక్తులలో కర్ణాటకకు చెందిన సతీష్ కుమార్
ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా వుంది, అలాగే కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.