వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) భావన దెబ్బకే కూటమి ప్రభుత్వంలో తీవ్ర భయం పట్టుకుందని మాజీ మంత్రి, పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇటీవల CRDA సమావేశంలో అమరావతి, విజయవాడ, గుంటూరులను కలిపి ‘అవిగన్’ పేరిట రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తీర్మానం చేయడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బందరులో చంద్రబాబు నాయుడి చుట్టాలు గానీ, సన్నిహితులు గానీ లేకపోవడం వల్లే ఆ ప్రాంతాన్ని రాజధాని కారిడార్ నుంచి వదిలేశారని ఎద్దేవా చేశారు.