హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌పై ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తన ప్రేమ వివాహాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా తండ్రే తనపై, తనకు అండగా నిలిచిన వారిపై దాడులు చేయిస్తున్నారని రూపా రెడ్డి కుమార్తెను వివాహం చేసుకోవాలని తాను నిశ్చయించుకున్నప్పటి నుంచి ఆమె నివాసంపై దాడులకు దిగారని ఈ ఘటన వెనుక పూర్తిగా తన తండ్రి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తమే ఉందని, ఆస్తి వివాదాలు, అంతర్గత మనస్పర్థల కారణంగానే ఈ రకమైన దాడులు చేయిస్తున్నారని సంతోష్ ఆరోపించారు.