కృష్ణా జిల్లాలో ప్రేమ పేరుతో ఓ యువతిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,కొత్తపేటకు చెందిన 19 ఏళ్ల యువతి, అవనిగడ్డకు చెందిన సందీప్ అనే యువకుడితో గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆగస్టు నెల 2వ తేదీన యువతి బస్సులో వస్తుండగా మార్గమధ్యంలో సందీప్ బస్సును ఆపించి ఆమెను కిందకు దింపి తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని మోపిదేవి సమీపంలోని పొలాల వద్దకు తీసుకెళ్లి దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
- 0 Comments
- Krishna District