యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)’ విధించే అంశంపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటవుతుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టంచేశారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయాలంటే దాని నిర్వహణ వ్యయాన్ని ఎవరో ఒకరు భరించాల్సిందేనని, యూపీఐపై ఎండీఆర్ అంశం ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు. ప్రభుత్వం చట్ట సవరణ ప్రక్రియలో ఉందని, తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని చెప్పారు.