తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటనలో కల్పించిన భద్రతా ఏర్పాట్లపై మాజీ మంత్రి అమర్నాథ్ పోలీసు యంత్రాంగం వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుబట్టారు. ‘జడ్ ప్లస్’ కేటగిరి భద్రత పొందాల్సిన మాజీ సీఎం హెలిప్యాడ్ వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు చేరుకున్నప్పటికీ, వారిని నియంత్రించేందుకు కనీస స్థాయిలో కూడా భద్రతా సిబ్బంది లేకపోవడం ప్రభుత్వ ముమ్మాటికీ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. సాయంత్రం వరకు ఉన్న పకడ్బందీ పోలీసు బందోబస్తు, తెల్లవారేసరికి పూర్తిగా మాయమవడం వెనుక పెద్ద కుట్ర ఉందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.