ఉక్రెయిన్‌పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో రష్యా అటాక్ చేసింది. తాజా దాడిలో 17 మంది మరణించారు. 44 మంది గాయపడినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కీవ్‌పై చాలా భీకర స్థాయిలో రష్యా విరుచుకుపడింది. బుధవారం అర్థరాత్రి నుంచి ఆ దాడులు మొదలయ్యాయి. నగరంలోని మిలిటరీ అడ్మినిస్ట్రేషన్‌ను రష్యా టార్గెట్ చేసినట్లు తెలిసింది. అయితే రష్యా బాలిస్టిక్ దాడుల్ని తిప్పికొట్టేందుకు అమెరికా నిర్మిత పేట్రియాట్ మిస్సైల్ ఇంటర్‌సెప్టార్లు కావాలని ఉక్రెయిన్ తమ మిత్రదేశాలను కోరింది.