తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవల్ని ఈజీ చేసేందుకు డయల్ 112 అనే ఏకైక హెల్ప్‌లైన్ ఇప్పటికే అమలులో ఉంది. దీని ద్వారా పోలీసు (మునుపటి 100), అగ్నిమాపక (101), అంబులెన్స్/మెడికల్ (108), మహిళల భద్రత (181), బాలల సంరక్షణ (1098), విపత్తు నిర్వహణ (1077) వంటి అన్ని ప్రధాన అత్యవసర సేవలనూ పొందవచ్చు. ఇక ఈ నంబర్లకు విడివిడిగా కాల్ చెయ్యాల్సిన అవసరం లేదు. 112కి కాల్ చేస్తే, సంబంధిత విభాగాలన్నీ యాక్టివేట్ అవుతాయి.