ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా రెండు లక్షల మంది సంతకాలతో కూడిని పిటిషన్‌ను మోదీకి ఇవ్వాలని దాదాపు 100 మందితో మోదీ ఇంటికి వెళ్తున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. తనను పోలీసులు అడ్డుకోవడంపై కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రభుత్వం అడ్డుకోవడానికి చూపించే తెగువ ఏదో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై చూపించాలని మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఈ20 పెట్రోల్ రుద్దడాన్ని ఆపండి. లేదంటే దేశంలో మరో భారీ ఉద్యమం మొదలవుతుంది’’ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.