ఉదయనిధి స్టాలీన్.. నటి త్రిషపై చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై ఉదయ నిధిని అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలీన్ ఈ వివాదంపై స్పందించారు. సీఎం విజయ్ దళపతి ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.అంతే కాకుండా.. అహంకారం పెరిగిపోతే అది అంతే తొందరగా వినాశనానికి దారితీస్తుందంటూ చురకలుపెట్టారు.
కావేరి జలాల సాధనలో, మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో సీఎం విజయ్ తీరును ప్రశ్నించినందుకు డైవర్షన్ లో భాగంగా ఇదంతా చేశారని ఎంకే స్టాలీన్ ఎద్దేవా చేశారు.