గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాసం ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ ధర్నా నిరసన చేపట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. జగన్‌మోహన్ రెడ్డిని నేరుగా కలిసి పార్టీ అంతర్గత వ్యవహారాలు, తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు ప్రయత్నిస్తుంటే మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. సజ్జల తన అనుచరులు, సోషల్ మీడియా విభాగం ద్వారా తనపై కావాలనే రౌడీషీటర్ అనే ముద్ర వేసి తీవ్రమైన దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.