గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు షేక్ మహమ్మద్ ముస్తఫా కిడ్నాప్ కేసులో గుజరాత్‌లో నూజివీడు పోలీసులకు చిక్కారు. పరారీలో ఉన్న ముస్తఫాను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు ముస్తఫా కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. చివరకు గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకొని అరెస్టు చేశారు. వ్యాపార వివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌పై కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.