గుజరాత్ రాష్ట్రంలో ఇప్పుడు ఈ వైరస్ సోకడం వల్ల చనిపోతున్న చిన్నారుల సంఖ్య అక్కడి ప్రజలతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల్ని భయపెడుతోంది. చండీపుర వైరస్ వల్ల ఇప్పటికే 22 మంది పిల్లలు మరణించినట్లుగా అక్కడి అధికారులు వెల్లడించారు. నమోదైన 184 అనుమానిత కేసులలో 35 పాజిటివ్ కేసులు నిర్ధారించారు. ఈ వైరస్ పిల్లల మెదడుపై దాడి చేస్తుందని వైద్యశాఖ నిర్ధారించింది. దీనివల్ల ఈ వ్యాధిలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే సరైన సమయంలో చికిత్స అందిస్తే ఆ బిడ్డను కాపాడుకోవచ్చు.