ఢిల్లీ ఫైర్ సర్వీసెస్లో పదివేల 10,743 కొత్త పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం నుండి ఆర్థిక అనుమతి రాగానే త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందులో మొత్తం 3823 ఫైర్ ఆపరేటర్లు, 3,546 ఎమర్జెన్సీ రెస్క్యూ , 1,153 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇతర ఖాళీలు ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియను ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.