కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే పై ఢిల్లీలో మరో కేసు నమోదైంది. సోషల్ మీడియా ఇన్యూయెన్సర్ ఫైజాన్ అన్సారీ తనపై అభిజీత్ అనుచరులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అన్సారీ మాట్లాడుతూ.. అభిజీత్ డిప్కేపై ఢిల్లీ డీసీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశానని, అతని అనుచరులు తనపై దాడి చేసినట్లు అన్నిఆధారాలు ఉన్నాయని చెప్పారు. పుణేలో,ఔరంగాబాద్ లో తనపై దాడులు జరిగినట్లు వెల్లడించారు.