హోర్ముజ్ జలసంధి అంశంపై అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలను ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఖండించారు. తమ ప్రయోజనాలకు అనుగుణంగా నౌకల రాకపోకల కోసం ఒమన్‌తో మాత్రమే ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఒమన్ తో కుదిరే సాంకేతిక ఒప్పందం వల్ల జలసంధి పూర్వస్థాయిలో తెరుచుకోదని, అమెరికా విధించిన ఆంక్షలు, సైనిక ఆంక్షల వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆయన స్పష్టం చేశారు.