ఉత్తరప్రదేశ్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ సైకియాట్రిస్ట్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఘజియాబాద్ కు చెందిన 40 ఏళ్ల మెహికా అగర్వాల్ సైకియాట్రిస్ట్‌గా సేవలందిస్తోంది. ఏడాదిన్నర క్రితం ఆమె భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. విడాకుల కారణంగా మెహికా మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. అందుకే 18 నెలల నుంచి మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్‌తో బాధపడుతోంది.