అయోధ్యలోని రామమందిర విరాళాల చోరీపై ప్రతిపక్ష ఎంపీలు సోమవారం కూడా నిరసన కొనసాగించారు. రామ మందిరం విరాళాల చోరీతో పాటు విద్యార్థి నిరసనకారులపై పోలీసుల బలప్రయోగంపై పార్లమెంట్ ప్రాంగణంలోని మకర ద్వారం ముందు నిరసన చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌కు ఎందుకు రావడం లేదు? అన్న పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించడంతోపాటు నినాదాలు చేశారు. రామమందిరంలో విరాళాల చోరీకి ప్రతీకగా విరాళాల పెట్టెలను పార్లమెంట్ ఆవరణలో ఉంచారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాటి చుట్టూ బారులు తీరారు.