దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తరచూ జరిగే ఆందోళనలు, నిరసనల నియంత్రణపై మరియు ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని కోరుతూ సమర్పించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లాయర్ సతీష్ చంద్ కౌశిక్ దాఖలు చేసిన ఈ పిల్ పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఎంసీకి నోటీసులు జారీ చేసింది.