తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరి వల్ల నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ ఆవహించి ఆత్మహత్యాయత్నాలకు కూడా దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 20 వేల పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు.