ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ (ఆదివారం) సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఐదుగురు మృతిచెందగా.. 41 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫెర్రీలో మొత్తం 271 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇండోనేషియాలోని రెండో అతిపెద్ద నగరమైన తూర్పు జావాలోని సురబయ నుంచి దక్షిణ సులవేసిలోని మకాస్సర్కు వెళ్తుండగా ఈ అగ్నిప్రమాదం జరిగింది.