కులాలకు అతీతంగా జరిపే అద్భుతమైన పండుగ బోనాలు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. అమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని అన్నారు. సమైక్య రాష్ట్రంలో బోనాలను పట్టించుకోలేదని, బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించలేదని కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ వచ్చాక మాజీ సిఎం కెసిఆర్ బోనాలకు రాష్ట్ర పండుగ హోదా ఇచ్చారని, తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతోనని కెసిఆర్ చెప్పారని అన్నారు. రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలని తల్లికి మొక్కుకున్నామని, రైతు బాగుండాలని అమ్మను వేడుకున్నామని కెటిఆర్ పేర్కొన్నారు