సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర వైభవంగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ నిర్వాహకులు సీఎంకు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు.