బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి బ్యాంకులను బట్టి, బ్యాంచీల వారీగా కస్టమర్లకు వడ్డీ రేట్లను వేరు వేరుగా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఇస్తుంటారు. అయితే ఇకపై అలాంటి ఆందోళన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇకపై ఒకే బ్యాంకుకు చెందిన విభిన్న శాఖాల్లో ఒకే మొత్తానికి, అన్ని బ్రాంచులలోనూ ఒకే రోజు ఆమోదించిన సమాన డిపాజిట్లకు సమాన వడ్డీ రేటు వర్తింపజేయాల్సి ఉంటుంది.